ప్రాథమిక పాఠశాల పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలలు



కరకగూడెం మండలంలోని అనంతారం, భట్టుపల్లి ప్రాథమిక పాఠశాల పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి జి. మంజుల తెలిపారు.

ప్రభుత్వం విద్యాభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చిన్నారుల ప్రారంభ విద్యను బలోపేతం చేయడానికి ఈ పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందుబాటులోకి వస్తుందని ఆమె అన్నారు.

3-5 సంవత్సరాల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ యూకేజీలలో చేర్పించాలని,ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ప్రాథమిక పాఠశాలలోని ఒక తరగతి గదిని వినియోగించడంతో పాటు రంగురంగుల బొమ్మలు, ఆట వస్తువులు, చార్ట్స్, మరియు ఫర్నిచర్ ప్రభుత్వం సమకూరుస్తుంది. అలాగే ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఉపాధ్యాయులు మరియు ఆయాలను కూడా నియమిస్తుందని అన్నారు. కావున ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు