అగ్నిబాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పాయం అండ


పినపాక మండలం పాండరంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పరామర్శించారు. ప్రమాదంలో గొగ్గెల అబ్బయ్య, కొమరం రాంబాబు కుటుంబాల ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామనాథం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ , స్థానిక సర్పంచ్ ఈసం భవతి , ప్రజాప్రతినిధులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు.ఈ సందర్భంగా తన సొంత నిధుల నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్త ఇళ్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల మేరకు అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు కొరసా ఆనంద్, సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, అర్జున్, కంది భరత్ రెడ్డి, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు