వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా.. అర్హతకు ఇవే కీలక నిబంధనలు
వడదెబ్బ (హీట్‌వేవ్) కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) ద్వారా రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తుంది. అయితే ఈ పరిహారం పొందేందుకు మరణం వడదెబ్బ వల్లే సంభవించిందని శాస్త్రీయంగా నిర్ధారణ కావడం తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలు అమలు చేస్తోంది.
ప్రతి మండలంలో తహసీల్దార్, ప్రభుత్వ వైద్యాధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)లతో కూడిన త్రిసభ్య కమిటీ వడదెబ్బ మరణాలను పరిశీలించి ధ్రువీకరిస్తుంది. మరణం సంభవించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పనిసరిగా పోస్ట్‌మార్టం నిర్వహించాలి. వ్యక్తి ఇతర కారణాల వల్ల కాకుండా కేవలం వడదెబ్బ కారణంగానే మృతి చెందాడని నిర్ధారించిన తర్వాతే కేసును పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు పంచనామా నిర్వహించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు.
మరణం జరిగిన రోజున ఆయా ప్రాంతంలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) ధ్రువీకరణ కూడా అవసరం. అనంతరం డెత్ సర్టిఫికేట్, పోస్ట్‌మార్టం నివేదిక, ఎఫ్‌ఐఆర్, పంచనామా, మృతుడి మరియు వారసుల ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలతో ఎమ్మార్వో (MRO) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
అన్ని పత్రాలు, విచారణ నివేదికలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుంది.
#HeatWave #ExGratia #SDRF #SummerAlert #APNews #TelanganaNews #WeatherUpdate #PublicAwareness #SBNews
0 కామెంట్‌లు