మాజీ నాయకులు మళ్లీ పార్టీలోకి రావాలి. పసుపు పండుగకు హాజరైన గుండాల తెలుగుదేశం నాయకులు

మాజీ నాయకులు మళ్లీ పార్టీలోకి రావాలి

పసుపు పండుగకు హాజరైన గుండాల దేశం నాయకులు

గుండాల మండలం మే 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మహానాడు మహబూబాబాద్ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గం గుండాల మండల నాయకులు హాజరై వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభివృద్ధి కార్యకర్తల సంక్షేమం గురించి విధివిధానాల గురించి రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాల గురించి చర్చించినట్లు తెలిపారు.  అదేవిధంగా అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేసి వివిధ పార్టీలో చేరిన నియోజకవర్గ స్థాయి నాయకులను ఈ సందర్భంగా మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పార్టీలో చేరితే సమూచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ యుద్ద పరిస్థితులు చమరుకొరత వల్ల కార్యక్రమాలన్నీ వర్చువల్ గా నిర్వహించడం జరిగిందని త్వరలో రాష్ట్ర స్థాయి నాయకులతో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తోలెం సాంబయ్య, ఇల్లందుల నరసింహులు, సోలం చొక్కా రావు, మల్కం రామకృష్ణ, హుషార్, చీకటి యాకయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు