రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న VOAల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు డిమాండ్ చేశారు.

VOAలు తమ హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరాలను బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మహిళా నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు. VOAలు ప్రజలకు కీలక సేవలు అందిస్తున్నారని, వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి VOAలతో చర్చలు జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.#VOAStrike
#SupportVOAs
#RegaKanthaRao
#BRSParty
#VOADemands
#Telangana
#Pinapaka
#JusticeForVOAs
#VOAEmployees
#BRSForPeople