భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో గత కొన్ని రోజుల క్రితం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి, మరియు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహం నిర్మించగా అట్టి విగ్రహాల విషయంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ స్పందిస్తూ... విగ్రహాల విషయంలో పర్మిషన్ లేదని గత కొన్ని రోజుల క్రితం ఆర్ అండ్ బి అధికారులు నోటీసులు ఇవ్వగా అట్టి నోటీసులకు ఎటువంటి వివరణ రాకపోవడంతో నిన్న రాత్రి అన్ని విగ్రహాలు తొలగించారు అందులో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ విషయంలో కొంతమంది సో కాల్డ్ నాయకులు వారికి ఇష్టం వచ్చిన విధంగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సిగ్గుచేటు నాడు విగ్రహాల దగ్గర రాజకీయాలు చేయొద్దు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి కనీసం విగ్రహ ఆవిష్కరణ గురించి తెలియపరచకుండా వారికి నచ్చినట్టు చేసి పైగా నేడు విగ్రహ తొలగింపు విషయంపై ఎమ్మెల్యే గారి మీద బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అందులోని కొంతమంది నాయకులు నాడు మల్లెలమడుగులో నాటికి మాజీ మంత్రి పొంగులేటి, తెలంగాణ రాష్ట్ర మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్.పిడమర్తి రవి, నాటి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు అడ్డుపడిన నాయకులే నేడు అంబేద్కర్ గారి విగ్రహం పై ముసలి కన్నీళ్లు కార్చడం నేడు ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అని యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ హెచ్చరించారు. మేము కూడా అంబేద్కర్ గారి వారసులమేనని మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇతర రాజకీయ నాయకులు వాడడం గానీ , వారిపై బురదజల్లే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలని తెలియజేశారు
0 కామెంట్‌లు