హైదరాబాద్‌లో ప్రధాని Narendra Modi సభ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సభ ప్రాంగణంలో డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు తీసుకురావడాన్ని నిషేధించారు. పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
సభ కోసం నగరంలో 12 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్ సౌకర్యం కల్పించారు. రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
జిల్లాల నుంచి సుమారు 3,200 బస్సులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ ప్రాంతాల్లో బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి మెట్రో ద్వారా సభకు చేరుకోవాలని సూచించారు.
ఈ మేరకు మల్కాజ్గిరి సీపీ సుమతి కీలక సూచనలు జారీ చేశారు.
0 కామెంట్‌లు