అశ్వాపురం మండలం జగ్గారం ప్రాంతంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే రూట్‌లో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోవడంతో, వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ హైర్ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా మరో ట్రావెల్స్ బస్సు వస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ప్రమాదంలో సుమారు పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు, సిబ్బంది సహాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0 కామెంట్‌లు