అశ్వాపురం మండల పరిధిలోని సీతారాంపురం గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి ఈ కార్యాలయం కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఇది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు