పినపాక: పినపాక మండలం ఈ భయ్యారం క్రాస్ రోడ్‌లోని ఎక్సలెంట్ హై స్కూల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మణుగూరు డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ ట్రాఫిక్ సైన్ బోర్డుల గురించి వివరించారు. వాహనాలు నడిపే కుటుంబ సభ్యులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విద్యార్థులు ప్రేరేపించాలని సూచించారు. రోడ్డు భద్రతపై వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సీఐ వెంకటేశ్వర రావు, స్కూల్ చైర్మన్ యూసఫ్, ఎంఈఓ నాగయ్య, ఉపాధ్యాయులు, సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చివరగా డీఎస్పీ పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు