మణుగూరులో క్షుద్ర పూజల కలకలం

మణుగూరులో క్షుద్ర పూజల కలకలం
మణుగూరు జూనియర్ కళాశాల సమీపంలో క్షుద్ర పూజలు జరిగినట్లు అనుమానాస్పద పరిస్థితులు కనిపించాయి. కళాశాల వద్ద సిమెంట్ రోడ్డుపై ముగ్గు వేసి, పసుపు–కుంకుమతో నిమ్మకాయలు ఉంచిన దృశ్యాలు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. ఈ ఘటనతో విద్యార్థులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి చర్యలపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు