మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలి: సిపిఎం
పినపాక 


మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న పిలుపునిచ్చారు 
 పినపాక మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశం కామ్రేడ్ పూనేం రాజేశ్వరి అధ్యక్షతన ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న హాజరై మాట్లాడుతూ, రాబోయే మేడే కార్యక్రమాలను మండలంలోని అన్ని గ్రామ శాఖల పరిధిలో ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాయకులు విమర్శించారు. ధాన్యం మొత్తం దళారుల చేతికి వెళ్లిన తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అవసరమైతే రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి కామ్రేడ్ దుబ్బ గోవర్ధన్, కార్యదర్శి వర్గ సభ్యులు మడివి రమేష్, కల్తి వెంకటేశ్వర్లు, దడిగల వెంకన్న తదితరులు పాల్గొన్నారు