ఉపాధి హామీ పనులకు శ్రీకారం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం
పినపాక

పినపాక మండలం బోటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పాల చెరువు వద్ద జాతీయ ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ నూప బాపనమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే భూపాలపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని భూపాలపట్నం చెరువు వద్ద ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ స్వప్న ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ పనులు ఉపయోగపడేలా సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉపాధిహామీ ఏపీఎం వీరభద్ర స్వామి , గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు