అశ్వాపురం, ఏప్రిల్ 28 (ప్రతినిధి):
మండలంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, తగినంతగా అందుబాటులో ఉన్నాయని అశ్వాపురం సీఐ జి. అశోక్ రెడ్డి తెలిపారు. ప్రజలు అనవసరంగా భయపడి ఇంధనాన్ని ఇండ్లు, షాపుల్లో నిల్వ చేసుకోవద్దని ఆయన సూచించారు.
పెట్రోల్ బంకుల వద్ద వాహనాలలో మాత్రమే ఇంధనం నింపడం జరుగుతుందని, క్యాన్లు, బాటిల్స్ వంటి వాటిలో పెట్రోల్, డీజిల్ నింపడం జరగదని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాక్‌లో ఇంధనం అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఇప్పటికే ఎండాకాలం తీవ్రంగా ఉన్నందున ఇంధనాన్ని ఇంట్లో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంధనాన్ని నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
0 కామెంట్‌లు