ఆటో–లారీ ఢీకొని ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

ఆటో–లారీ ఢీకొని ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
పినపాక, ఏప్రిల్ 27: 

పినపాక మండలం గొట్టెల్లా గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఆటో మరియు లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు కిష్టపురంలో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఈసాం గోపాల్ (తండ్రి: నర్సయ్య) అక్కడికక్కడే మృతి చెందాడు.

గాయపడిన వారిలో మృతుని భార్యతో పాటు శ్రీదేవి, రమణ, రాములమ్మ, తరుణ్, కృష్ణకుమారి, సంధ్య, ప్రవీణ్ (ఆటో డ్రైవర్) ఉన్నారు. గాయపడిన వారిని తొలుత మణుగూరు ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం భద్రాచలం మరియు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

మృతుని తల్లి పోషక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు