అంగరంగ వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి

అంగరంగ వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి 
 
గుండాల మండలం ఏప్రిల్ 27 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

 శ్రీ వాసవి మాత జయంతిని పురస్కరించుకొని  గుండాల మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం  వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ గుండాల ఆధ్వర్యంలో  శ్రీ వాసవి మాత జయంతిని  అంగరంగ వైభవంగా  అత్యంత భక్తిశ్రద్ధలతో  జరుపుకున్నారు.  గ్రామంలోని పురవీధుల గుండా  ర్యాలీ నిర్వహించి రామాలయంలో కుంకుమ పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. ఆత్మగౌరవానికి ప్రతిరూపం, అహింసను ఆయుధంగా మార్చిన  వీరనారి శ్రీ కన్యకా పరమేశ్వరి  అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ గుండాల అధ్యక్షులు మానాల శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మానాలు ఉపేందర్ కోశాధికారి తవిడి శెట్టి రాంబాబు, తౌడుశెట్టి నాగరాజు,మానాల నారాయణమూర్తి,మానాల వీరన్న మానాల ప్రభాకర్, మానాల సతీష్,మానాల ప్రణీత్, గౌరీశెట్టి సత్యనారాయణ, ప్రభాకర్,శరత్, తాటిపల్లి సత్యనారాయణ, శ్రీరంగం శ్రీనివాస్,తాటికొండ వీరన్న, ఐత శ్రీశైలం, నాగమల్లయ్య, పూజిత్, నవీన్ నిఖిల్, పాలడుగు భరత్, నితీష్  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు