భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బోధిధర్మ షోటోకన్ కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఏటూరునాగారంలో పుణకోషి షోటోకన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎండి అబ్బు ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో పాల్గొన్నారు.
ఈ పరీక్షలో కారం అన్నుదొర, నాలి పరిణిత బ్రౌన్ బెల్ట్ సాధించగా, ఇర్ప సాత్విక, శ్రీ హాస్య, శరణ్య గ్రీన్ బెల్ట్, దేవాల్ష్, ఆకాష్ ఆరెంజ్ బెల్ట్ పొందారు. విద్యార్థుల ప్రతిభను జగన్ మాస్టర్, వీరస్వామి మాస్టర్, హుస్సేన్ మాస్టర్, రవికుమార్ మాస్టర్ అభినందించారు.
0 కామెంట్‌లు