గుట్ట మల్లారం గ్రామంలో హృదయ విదారక ఘటన



మణుగూరు మండలం గుట్ట మల్లారం గ్రామంలో ఆరు నెలల పసిపాపను వదిలిపెట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని వైకుంఠధామంలో పనిచేస్తున్న కాటికాపరి ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రతి రోజు లాగానే ఉదయం స్మశానవాటిక పరిసరాలను పరిశీలిస్తూ పనులు చేసుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్లగా అక్కడ పసిపాప పడిఉండటం గమనించినట్లు తెలిపారు. దగ్గరికి వెళ్లి చూడగా పసికందు ఇప్పటికే మృతిచెందినట్లు గుర్తించి తీవ్రంగా కలచివేసిందన్నారు.

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పాపను అక్కడ వదిలిన వారెవరు అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు