కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో వలస ఆదివాసుల గుడిసెల కూల్చివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు వలస ఆదివాసుల గుడిసెలను కూల్చివేశారు. డిఆర్ఓ సుజాత, బీట్ ఆఫీసర్ ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అటవీ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
0 కామెంట్‌లు