పశువుల అనారోగ్యంపై వెంటనే వైద్యులను సంప్రదించాలి: వెటర్నరీ వైద్యురాలు శిరీష
పినపాక: పశువులకు అనారోగ్య సమస్యలు కనిపించిన వెంటనే యజమానులు పశువైద్యశాలను సంప్రదించాలని పినపాక వెటర్నరీ వైద్యురాలు శిరీష సూచించారు. గురువారం పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ఆమె సిబ్బందితో కలిసి పశువులకు నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్యానికి గురైన ఒక గేదెను ఖమ్మం పశువైద్యశాలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు.
పశువుల ఆరోగ్య పరిరక్షణలో యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
0 కామెంట్‌లు