పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సోమవారం సర్పంచ్ స్వప్న పరిశీలించారు. స్థానిక సెక్రటరీ చంద్రకుమార్‌తో కలిసి ఇళ్ల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను త్వరితగతిన విడుదల చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తే భవిష్యత్తులో మరిన్ని ఇళ్ల మంజూరు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నిట్ట శిరీష, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు