గిరిజన ఆశ్రమ పాఠశాలపై ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ

గిరిజన ఆశ్రమ పాఠశాలపై ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం వద్ద ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూను పరిశీలించి, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులకు పోషకాహారం అందించేలా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పకుండా పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. వంటశాల, నిల్వ గదులను పరిశీలించి శుభ్రత పాటించాలని ఆదేశించారు.

పాఠశాలలో విద్యా ప్రమాణాలు, హాజరు శాతం, వసతి సౌకర్యాలపై కూడా ఆయన ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, ఆఫీస్ సిబ్బంది బాలకృష్ణ, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు