వైద్య ఖర్చులకు అండగా నిలిచిన “జనం కోసం మనం” సంస్థ

వైద్య ఖర్చులకు అండగా నిలిచిన “జనం కోసం మనం” సంస్థ
 పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన గుండారపు సమ్మక్క (52) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించగా, ప్రస్తుతం ఎంజీఎం వరంగల్ లో చికిత్స పొందుతున్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన సమ్మక్కకు వైద్యం కోసం అవసరమైన ఖర్చులు భరించడం కష్టంగా మారింది. రోజువారీ కూలి పనిపై ఆధారపడే కుటుంబం కావడంతో చికిత్స ఖర్చులు భారంగా మారాయి.

ఈ విషయం తెలుసుకున్న మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” స్వచ్చంద సంస్థ స్పందించి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని సమ్మక్క కుటుంబ సభ్యులకు అందించింది.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వేముల భాస్కర్, బండారు సురేష్, ఎస్‌కే అజారుద్దీన్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు