ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించాలి.
రైతులతో ఆందోళనలు ఉధృతం చేస్తాం.
-సిపిఎండిమాండ్
గుండాల మండలం ఏప్రిల్ 21 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
మారుమూల ఏజెన్సీ గుండాల మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల నాయకులు తోలెం గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సోమవారం నాడు వారు మొక్కజొన్న రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, పినపాక ఎమ్మెల్యే వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే రైతులు మొక్కజొన్న కోత ప్రారంభించారన్నారు,దళారులు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారనైనారు, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తక్కువ రేట్లకు అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు అప్పుల ఊబిలో కూరుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేకపోతే మండలంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు కొనుగోలు కేంద్రానికి అనుమతి రాలేదని చెబుతున్నారని అన్నారు, దళారుల ప్రయోజనం కోసం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు, రైతుల వద్ద పంట దళారుల చేతికి చేరిన తర్వాత కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారా అని వారు ప్రశ్నించారు, ఈ కార్యక్రమంలో కల్తీ రాంబాబు,ఇరప వీరస్వామి,రామక్క,రవి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు