ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలు

గుండాల మండలం ఏప్రిల్ 21 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలు గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం  మండల అధ్యక్ష కార్యదర్శులు తోలం సాంబయ్య ఇల్లందుల అప్పారావు, నరసింహులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా లోని మారుమూల గ్రామం నారావారిపల్లి లో జన్మించి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ప్రపంచ పటంలో హైదరాబాదు నగరాన్ని నిలిపారని ఐటి, కంప్యూటర్ మొబైల్ కంపెనీల తయారీకి పునాదిరాయి ఆనాడే వేశారని మారుమూల ప్రాంతాల రోడ్లు కరెంటు తదితర మౌలిక వసతులు కల్పించారని నేడు జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని 76 ఏళ్ల వయసులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం నవ యువకుడిలా పనిచేస్తున్నారని వారి స్ఫూర్తితో కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చీకటి యాకయ్య, హుషారు, మొల్కం మధు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు