పినపాక
పినపాక మండలం సీతారాంపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అర్చకులు పులివర్తి పెద్దచార్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఉదయం 4 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి, నూతన వస్త్రాలతో అలంకరించారు. తరువాత సుడుచూపచార పూజ, కుంకుమార్చన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు