గుండాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

గుండాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

*పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేత*

*గుండాల మండలం ఏప్రిల్ 18 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల మండలంలోని రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకుడు వాగబోయిన రమేష్ మరియు సామాజిక నేత షారోజ్ కలిసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండాల ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పండిస్తున్నప్పటికీ సరైన కొనుగోలు కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అరుగాలం కష్టపడిన రైతులకు నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు సరైన ధర లభించడమే కాకుండా మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని అన్నారు.

అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి గుండాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు