గొర్రెలపై దూసుకెళ్లిన కోళ్ల వ్యాన్… 40 గొర్రెల మృతి

గొర్రెలపై దూసుకెళ్లిన కోళ్ల వ్యాన్… 40 గొర్రెల మృతి

మణుగూరు ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీఎస్పీ సమీపంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రోడ్డుపై గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ అదుపుతప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.

ఈ ఘటనతో గొర్రెల యజమానికి భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు