గుండాల, ఏప్రిల్ 22 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో అన్యువల్ డే మరియు ఫేర్‌వెల్ డే వేడుకలను ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు తవిడిశెట్టి రాంబాబు, ఈసం రాజశేఖర్, సీఆర్పీ మేడం, అంగన్వాడి కార్యకర్త పద్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ 5వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అందరిని అలరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శరత్ బాబు, ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, ప్రమీల, వెన్నెల తదితరులు, విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.
— ఎస్‌బి న్యూస్ ప్రతినిధి
0 కామెంట్‌లు