నాగర్ కర్నూల్, ఏప్రిల్ 06,(ఎస్ బి న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా
తెలకపల్లి, గ్రామం లో వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలకపల్లి సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్ సూచించారు. రోజుకు కనీసం నాలుగు , లేదా ఐదు లీటర్ల నీరు తాగడం అవసరమని తెలిపారు.
99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సోమవారం తెలకపల్లిలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఎండలో పని చేయడం వల్ల చెమట ద్వారా శరీరం నీరు, లవణాలు కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. సాధారణ నీరు మాత్రమే తాగడం వల్ల నీటి లోటు తగ్గినా, లవణాల లోటు భర్తీ కాకపోవడంతో డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు. అందుకే ఓఆర్ఎస్ వినియోగం అవసరమవుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సందీప్ రెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు