నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 05(ఎస్ బి న్యూస్ ప్రతినిధి):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని నల్ల మల ప్రాంతం లోని రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధి లో స్వయంభూ దేవుడిగా వెలసి శ్రీశైలం ఉత్తరముఖ ద్వారం గా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంను సోమ వారం రోజు ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా ఎమ్మెల్యే కు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీర్ల ఐలయ్య, ఆలయం కలిగిన సుదీర్ఘ ప్రాచీన చరిత్రను అడిగి తెలుసుకొని అవగాహన పొందారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలు, నిత్య అన్నదానం, అభి వృద్ధి కార్యక్రమాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని ఆనందాన్నివ్యక్తం చేశారు .
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన, స్థానిక శాసన సభ్యులు డా. వంశీకృష్ణ ప్రత్యేక దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఛైర్మన్ బీరం.మాధవ రెడ్డిని అభినందించారు.
కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు