సురక్షితమైన, సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బాధావత్ సంతోష్ సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోసోమ వారం ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన “ఈట్ రైట్ క్యాంపెయిన్” ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువత జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చిప్స్, కేకులు, నూడిల్స్, కార్బోనేటెడ్ పానీయాల వినియోగాన్ని తగ్గించి, స్థానికంగా లభించే సీజనల్ పండ్లు తీసుకోవాలని అన్నారు. ఉప్పు, చక్కెర, నూనె తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.
ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అలాగే జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలను చేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె. రవికుమార్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డా. టి. ఉషారాణి, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీలత రెడ్డి, ఆర్ఎంఓలు, నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ప్రోగ్రాం అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు