కొత్తగూడెం లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన జిల్లా స్పెషల్ న్యాయమూర్తి జి. ప్రేమలతను కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ ముధల్కర్, ఈసీ సభ్యులతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి ఛాంబర్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ ముధల్కర్ మాట్లాడుతూ, జిల్లా న్యాయమూర్తికి మరియు న్యాయవాదులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. న్యాయవ్యవస్థ అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగుతుందని, న్యాయవ్యవస్థ మరియు ప్రజల మధ్య మంచి వాతావరణం ఏర్పడేలా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ సాజహన్ పర్వీన్, కాటూరి సంజీవ్ రావు, ప్రధాన కార్యదర్శి గడిపెల్లి మహేష్, జాయింట్ సెక్రటరీ గాడదాసు నాగరాజు, క్రీడల కార్యదర్శులు బానోత్ దేవదాసు, నకరాకంటి ఉమ, మహిళా ప్రతినిధి మల్లెల ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు