గురువు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే పాయం

గురువు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తనకు హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా బోధించిన గురువు ఎర్రాప్రగడ రామమూర్తి ఇంటిని గురువారం సందర్శించారు. తన ఇంటికి వచ్చిన శిష్యుడిని రామమూర్తి పుష్పగుచ్ఛంతో స్వాగతించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం గురువుగారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, రానున్న మే 10న నిర్వహించనున్న రామమూర్తి రచించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని తెలిపారు. చాలా కాలం తర్వాత గురువుగారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు