📍 పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
📅 తేదీ: 17-04-2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీల ద్వారా ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించాలని నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పినపాక మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ఉన్న మొండి వైఖరిని విడనాడి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పీఆర్‌సీ కమిషన్ నివేదికను వెంటనే తీసుకొని 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, కొత్త హెల్త్ కార్డులను తక్షణమే ప్రారంభించాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడమే కాక
రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలన్నారు.మొత్తం 63 సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.అనంతరం పినపాక మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు