పినపాక మండలం వెంకట్రావుపేట ఇండిపెండెంట్ సర్పంచ్ సుతారి సింధూజ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సింధూజకు,
ఉప సర్పంచ్ మాటూరి రవీందర్, కొప్పుల రామనాధం కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింధూజ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకోవడంతో గ్రామ అభివృద్ధి కోసం పార్టీలో చేరినట్లు తెలిపారు.పినపాక మండలంలో మొత్తం 23 సర్పంచ్ స్థానాల్లో ఇప్పటికే 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీలో ఉండటం విశేషం.
ఈ కార్యక్రమంలో , మండల కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, కొర్సా ఆనంద్, కంది విజయ్ భరత్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు