కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి

 కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి
మణుగూరు:
ప్రజా పాలన–ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, రోడ్డు భద్రత నియమాల అవగాహన కోసం ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రారంభించారు.

మణుగూరులోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ శిబిరంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కంటి చూపు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అనంతరం డీఎస్పీతో పాటు సిఐ నాగబాబు, ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ శిబిరంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గౌరీ ప్రసాద్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.



#RoadSafety #EyeCamp #Manuguru #DSPRavinderReddy #HealthCamp #TelanganaNews #DriversSafety


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు