కిడ్నీ ఫెయిల్యూర్ లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రాణాలను కాపాడే కీలక వైద్య సేవలైన డయాలసిస్ సెంటర్లను పినపాక నియోజకవర్గానికి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
అశ్వాపురం, మణుగూరు, కరకగూడెం, గుండాల ప్రాంతాల్లో మొత్తం నాలుగు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్ల ద్వారా స్థానికంగా రోగులకు సౌకర్యవంతమైన చికిత్స అందుబాటులోకి వస్తుందని, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు.
ఈ సెంటర్ల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే పాయం ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి వైద్య సదుపాయాలు మరింతగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
0 కామెంట్‌లు