అశ్వాపురం మండలం కళ్యాణపురంలో యూత్ కాంగ్రెస్ గ్రామ, సోషల్ మీడియా కమిటీల ఎన్నిక
అశ్వాపురం, ఏప్రిల్ 16:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం కళ్యాణపురం గ్రామపంచాయతీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ మరియు సోషల్ మీడియా కమిటీలను ఎన్నుకున్నారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, నియోజకవర్గ అధ్యక్షుడు సూరపరెడ్డి తరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు ఓరగంటి బిక్షమయ్య ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండల నాయకులు భుక్య భద్రం, యన్నా సంగీతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం గ్రామ పెద్దలను శాలువాలతో సత్కరించారు.
గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీగా భుక్య రవిని అధ్యక్షుడిగా, యన్నా సంగీతరావు, బాధవత్ కోటేశ్వరరావులను ఉపాధ్యక్షులుగా, భనోత్ వినోద్‌ను కార్యదర్శిగా, గంధం నవీన్‌ను జనరల్ సెక్రటరీగా, సోషల్ మీడియా సభ్యులుగా భూక్య నరేష్ తదితరులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
#YouthCongress #Ashwapuram #Pinapaka #Kalyanapuram #TelanganaPolitics #CongressParty #YouthLeaders #SocialMediaTeam #sbnews
0 కామెంట్‌లు