పొట్లపల్లి గ్రామపంచాయతీలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని పొట్లపల్లి సర్పంచ్ మద్దెల సమ్మయ్య అన్నారు. ఎంతోకాలంగా రిపేర్ లో ఉన్న బోర్లను పంపులను రిపేర్ చేస్తున్నట్లుగా తెలిపారు. అవసరమైన చోట నూతన బోర్లను వేస్తున్నట్లుగా తెలిపారు. సమస్య తెలిపిన వెంటనే స్పందిస్తున్న ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు, భగీరథ డిఈ బ్రహ్మదేవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్, సెక్రటరీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు