తోగూడెం గ్రామపంచాయతీలో రహదారి పనుల పరిశీలన


పినపాక మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రహదారి నిర్మాణ పనులను సంబంధిత శాఖ డీఈ పార్శా నాయక్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల నాణ్యత, వేగం, పనుల పురోగతిపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. రహదారులు గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ అచ్చ నవీన్ కూడా పాల్గొని, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు