సీతారాంపురంలో పోషణ పక్వాడా – సర్పంచ్ అనిత ఏమన్నారంటే

సీతారాంపురంలో పోషణ పక్వాడా – సర్పంచ్ అనిత ఏమన్నారంటే
పినపాక


సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సంతులిత ఆహారం ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అనిత మాట్లాడుతూ గ్రామంలో ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా గర్భిణీలు మరియు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామాభివృద్ధికి పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తాను ఎప్పుడూ ముందుంటానని సర్పంచ్ అనిత స్పష్టం చేశారు. గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ఉపేందర్ తదితరులు పాల్గొని పోషకాహారం, పరిశుభ్రతపై సూచనలు చేశారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు