పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ నివారించండి 
మోడీ ప్రభుత్వ కుట్రాలను  ఎండగట్టండి


సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి డిమాండ్

గుండాల మండలం ఏప్రిల్ 29 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

తెలంగాణలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని  దీంతో ప్రజలు,రైతులు, వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం లాభపేక్షతోనే ఈ ఆయిల్ కంపెనీలు ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నయని,  కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు కలిసి సామాన్యుని దోచుకునేందుకు పన్నిన కుట్రలో భాగమే ఇది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చమురు సంస్థల ద్వారా   అన్ని బంకులకు ఆయిల్ అందించాలని సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు దేశంలో ఇందన నిలువలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూనే మరోవైపు కృత్రిమ కొరతను సృష్టించడం కేంద్ర బీజేపీ ప్రభుత్వ కపట నీతికి నిదర్శనమని, యుద్ధ నేపథ్యంలో ఆయిల్ సంక్షేమాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథంలో ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు  పెంచకుండా నిలిపివేసింది అని ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై  భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు. ఇంధనం దొరకక లారీలు,  వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని దీంతో నిత్యవసరాల ధరలు పెరిగి పేద మధ్య ప్రజలపై భారం పడుతుందని తక్షణమే ప్రజలు ఇబ్బందులు పడకుండా  అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.