ప్రభుత్వ ఆసుపత్రి లో డయాలసిస్ సెంటర్ మంజూరు కు పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కు అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకుడు ఓరుగంటి రమేష్ బాబు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల కష్టాలను గుర్తించి, అశ్వాపురం మండలం సహా నాలుగు మండలాల్లో డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంతకాలం డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్న రోగులకు ఇప్పుడు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రావడం చాలా ఉపశమనకరమని ఆయన తెలిపారు. ప్రజారోగ్యంపై ఎమ్మెల్యే కి ఉన్న చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న కట్టుబాటు ఈ నిర్ణయంతో స్పష్టంగా కనిపిస్తున్నాయని రమేష్ బాబు పేర్కొన్నారు.
0 కామెంట్‌లు