పత్రికా ప్రకటన | ది.27-04-2026 | మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో గో ఆహ్వాన్ అభియాన్ సమస్త ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మణుగూరు తహసిల్దార్ అద్దంకి నరేష్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు లింగంపల్లి రమేష్, కట్ల నరేష్ మాట్లాడుతూ ఆవుకు ఉన్న ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. మనిషి మనుగడలో ఆవు పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఆవు ద్వారా లభించే పాలు, పేడ, మూత్రం వంటి వనరులు ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణానికి ఉపయోగపడతాయని తెలిపారు.
అనాదికాలం నుంచి గోవును తల్లిగా భావిస్తూ గోమాతగా పూజిస్తున్నామని, గోవు రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గోవును రక్షించి దానికి తగిన గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు