ఇల్లందుకు చెందిన మొహమ్మద్ షహీజాద్ ఆలం (తండ్రి: యాకుబ్ ఆలం) ప్రస్తుతం హైదరాబాద్‌లో సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
అయితే తన ఉద్యోగంతో పాటు సమాజ సేవలో కూడా చురుకుగా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. జమాతే ఇస్లామీ హింద్ కార్యకర్తగా సేవలందిస్తున్న ఆయన, ప్రతి నెల తన జీతంలో 20 శాతం భాగాన్ని పేదలకు, అవసరార్థులకు అందజేస్తూ సహాయహస్తం అందిస్తున్నారు.
ఆయన చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులలో ప్రశంసలు అందుకుంటున్నాయి. స్వార్థరహిత సేవా భావంతో ముందుకు సాగుతున్న షహీజాద్ ఆలం, నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సమాజానికి ఉపయోగపడే విధంగా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిస్తున్నారు.
0 కామెంట్‌లు