భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామపంచాయతీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ మరియు సోషల్ మీడియా కమిటీ ఎన్నికలు నిర్వహించారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరపరెడ్డి తరుణ్ రెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు ఓరగంటి బిక్షమయ్యల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ఎన్నికలను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉసా అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లంకమల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీకి కాకా సందీప్ అధ్యక్షుడిగా, కమ్మని సత్యనారాయణ, పోడియం రమేష్ ఉపాధ్యక్షులుగా, మాణిక ప్రశాంత్ సెక్రటరీగా, సోడే సాయి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
సోషల్ మీడియా కమిటీకి సోడే రాజు, కాకా సర్వేశ్ అధ్యక్షులుగా ఎంపిక కాగా, గ్రామ కమిటీ సభ్యులుగా కారం రాము, పోడియం ప్రేమ్, కొమరం వివేక్, పోడియం జంపన్న తదితరులు ఎన్నుకోబడ్డారు.
ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు.
0 కామెంట్‌లు