ప్రతి ఇంటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం: ఆర్డబ్ల్యూఎస్ డీఈ


పినపాక మండలంలోని పొట్లపల్లి, తోగూడెం గ్రామపంచాయతీలలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ఆర్డబ్ల్యూఎస్ డీఈ బ్రహ్మ దేవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి నిరంతర తాగునీటి సరఫరా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.మిషన్ భగీరథ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేయడానికి అధికారులు, సర్పంచులు, సెక్రటరీ లు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.పనుల నాణ్యతపై రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ప్రజలు కూడా పనులపై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోట్లపల్లి సర్పంచులు మద్దెల సమ్మయ్య,తొగ్గుడెం సర్పంచ్ పునేమ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు అచ్చ నవీన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రవీణ్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు