ఏప్రిల్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు: ఎంపీడీవో వెంకటేశ్వరరావు


ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు.
మంగళవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో సెక్రటరీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గ్రామసభల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామసభలను సమయానికి నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నమోదు చేసి, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులపై సమగ్ర చర్చ జరిపి, ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామస్థులందరూ గ్రామసభలకు హాజరై తమ సమస్యలను వెల్లడించాలని ఎంపీడీవో కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు