దేవస్థానం, ప్రభుత్వ భూముల అక్రమాలపై చర్యలు తీసుకోండి

దేవస్థానం, ప్రభుత్వ భూముల అక్రమాలపై చర్యలు తీసుకోండి
– CPIML మాస్ లైన్ పార్టీ డిమాండ్
భద్రాచలం, మార్చి 22:
భద్రాచలం దేవస్థానం, ప్రభుత్వ భూములను ప్రభావవంతులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని CPIML మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి ఆరోపించారు. ఆదివారం భద్రాచలం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అక్రమ ఆక్రమణలను ప్రభుత్వం వెంటనే తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలు కూలి పనులు చేసుకుని జీవించే వారి గుడిసెలపై చర్యలు తీసుకోవద్దని సూచించారు.
గిరిజన చట్టాల అమలులో లోపాలు ఉన్నాయని, కొంతమంది అధికారుల సహకారంతో ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. అభివృద్ధి పనులు పీసా చట్టం ప్రకారం జరగాలని, సహజ వనరుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సాయన్న, మునిగేలా శివ ప్రసాంత్, మడకం దేవయ్య, మడివి జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు